Vatsavayi

Vatsavayi - Andhra Kshatriya surname
Name: Vatsavayi
Evolved from: Sagi
Gothram Vasista
Facts Lists Maps
Vatsavayi - Andhra Kshatriya surname
Vatsavayi - Andhra Kshatriya surname
Vatsavayi - Andhra Kshatriya surname
పెద్దాపురం ప్రాచీన ఆంధ్రదేశములో పురాతన సంస్థానాలలో ఒకటి. ఇంచుమించు ఐదు వందల ఏళ్ల పూర్వ చరిత్ర కలది. గోదావరి మండలం లోని చాలా భాగం, కృష్ణ - గుంటూరు మండలాలలోని కొంత భాగం, విశాఖపట్నం లోని కొన్ని గ్రామాలు అయిన తోటపల్లి, రంపచోడవరం మొదలగు మన్యం ప్రాంతాలు ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలోనివి. సంస్థానంలోని ముఖ్య పట్టణం అయిన "పెద్దాపురం" తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం (ఇప్పటి రాజముండ్రి) కు ఈశాన్య దిక్కుగా 32 కి.మీ. దూరంలో ఉంది. 1803 నాటికి పెద్దాపురం సంస్థానం ఆదాయం పది లక్షలు. సాలుసరి పేష్కషు (కప్పం రూపములో వచ్చే ఆదాయం) ఆరున్నర లక్షలు. రాజా వేంకట సూర్య నారాయణ జగపతి రాజు గారి పేర నమోదయిన కొట్టాము ఎస్టేటు యొక్క రాబడి రెండున్నర లక్షలు పేష్కషు ఇరవై ఆరువేల నూట డెబ్బై మూడు రూపాయలు. కొట్టాము ఎస్టేట్ యొక్క ముఖ్యపట్టణం తాండవనది ఒడ్డున ఉన్న తుని.
అంత పెద్ద సంస్థానం కాలక్రమంలో చిన్న చిన్న భాగాలుగా విభజించబడి చివరికి కొట్టాము, తుని ఎస్టేటు గా మారిపోయి, ఆ తరువాతి కాలంలో ఆంద్రప్రదేశ్ రాష్త్రంలో అంతర్భాగం అయ్యింది.
పెద్దాపురం సంస్థాన సంస్థాపకులు వత్సవాయి తిమ్మరాజు (ముక్కు తిమ్మరాజు). కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తాలూకాలో వత్సవాయి అను గ్రామముంది.. అక్కడకు వచ్చిన సాగి రామరాజుకు ఆ గ్రామ నామమే గృహనామమైనది. వత్సవాయి తిమ్మరాజు క్రీ.శ. 1530న జన్మించారు. తిమ్మరాజు తండ్రి పేర్రాజు. వీరు ఎనిమిది మంది సోదరులు. 1555న పెద్దాపురం కోటలో ప్రవేశించి సంస్థానంను స్థాపించి, 1607వరకు పరిపాలించి స్వర్గస్థులయ్యారు. తిమ్మరాజు బిక్కవోలు నందుండిన తురుష్క వీరులతో ఘోరమగు యుద్ధం చేసి జయించారు. రాజమహేంద్రవరం సర్కారు తిమ్మరాజు వశమైంది. క్రీ.శ.1572న గోల్కొండ సుల్తాను యొక్క సేనాపతియగు రాహత్‌ఖాన్ రాజమహేంద్రవరం సర్కారు మీదికి దండెత్తి వచ్చాడు. తురుష్క వాహినుల నడ్డగించుట దుస్సాహసమని నిశ్చయించుకొని, తిమ్మరాజు రాహత్‌ఖాన్ ని కలిసి రాజమహేంద్రవరం సర్కారులోని 18 పరగణాలు మాత్రం తిమ్మరాజుగారు అనుభవించుటకు సంధి చేసుకొనిరి. చతుర్భుజ తిమ్మరాజుగా వాసికెక్కిన ఈ ముసలి తిమ్మరాజు బహుపరాక్రమశాలి, కార్యఖడ్గ నిపుణుడు. పెద్దాపుర సంస్థానంను స్థాపించి వృద్ధి చేసారు. పెద్దాపురం తాలూకా నంతయును, తుని, పిఠాపురం, రామచంద్రాపురం తాలూకాలలో చాలా భాగంను, తోటపల్లి, జడ్డంగి మున్నగు మన్యప్రదేశాలను పరిపాలించారు. పెద్దాపురంనందును, బిక్కవోలునందును తురుష్కులను, తూర్పుదేశాన శత్రురాజులను జయించారు.ఇతను 1607లో కాలధర్మం చెందాడు.
తిమ్మరాజు జేష్టపుత్రులైన వత్సవాయ రాయప (జగపతి) రాజు బహద్దరు (1607-1649) 1607లో పట్టాభిషికులయ్యాడు. ఇతని పాలనలో మరొక రెండు పరగణాలు జమీలో కలిసినవి. ఇతనూ తన తండ్రిగారి వలే పరాక్రమశాలి.రంపకు 4 మైళ్ళ దూరాననున్న అమ్మయ్యగట్టు చెంత తురక సైన్యంను జయించాడు. అనేక మన్నె రాజులను జయించి సామంతులుగా జేసుకున్నాడు. ఇతను రౌతలపూడి ,, అన్నవరంలోను కోటలు కట్టించాడు. రాయజగపతి కుమారులు తిమ్మరాజు, బలభద్రరాజు. వీరు 1649 నుండి 1688 వరకు పరిపాలించారు. వీరు పర్లాకోట, బావిణికోట, యోదుకోట, మన్యపు దుర్గంలను వశం చేసుకొనిరి. సార్వభౌమ తిమ్మరాజు తమ బంధువైన నారాయణరాజు చిల్లంగికోటను, వారిభూములను వశంచేసుకొని కిమ్మూరి పరగణాలలో కలుపుకున్మనారు. సంతాన హీనుడైనందున ఇతని తమ్ముడైన బలభద్రరాజు కుమారుడు రెండవ రాయపరాజు 1688 నుండి 1714 వరకు పరిపాలించాడు.
ఇతని జేష్టకుమారుడైన మూడవ (కళా) తిమ్మరాజు (1714-1734) తండ్రి మరణించుసరికి బాలుడగుట వలన ఇతని తల్లి రాఘవమ్మ బాలుని పట్టాభిషిక్తుని జేసి తామే పరిపాలన భారం వహించింది. రుస్తుంఖాన్ అనే హాజీ హుస్సేన్ రాజమహేంద్రవరం ఫౌజుదారిగా నున్న సమయంలో సైన్యసమేతముగా పెద్దాపురం వెళ్ళి పాండవులమెట్ట వద్ద రాఘవమ్మకు తమ కుమారు లిరువరిని తనవద్దకు పంపిన యెడల రాజ్యం వారికి స్థిరపరచి పోయెదనని వర్తమానం పంపాడు. ఖానుని బలమెరిగి చేయునదేమున లేక తమ పుత్రులిద్దరిని పంపించింది. కాచిన నూనెను వెన్నుపై పోయించి రుస్తుంఖాన్ వారివురిని చంపించాడు. ఈ వార్తవిని రాఘవమ్మ, మిగిలిన క్షత్రియ స్త్రీలు అగ్నిజ్వాలలకు ఆహుతిలయ్యారు. పెద్దాపుర సంస్థానం మహమ్మదీయుల వశమైనది. 3వ తిమ్మరాజుగారి పుత్రుడు జగపతి కప్పుడు ఏడు మాసాల వయసు. ఇతడిని విజయనగర సంస్థాదీశుడైన పెదవిజయరామ గజపతి విజయనగరం తీసుకొచ్చి సీతారామ సార్వభౌమ కుమారుడగు ఆనందరాజుతో పాటు పెంచారు. జగపతి విజయనగర కోటలో పెరిగి 16 సంవత్సర వయస్సులో నున్నపుడు విజయరామ గజపతి పెద్దాపుర సంస్థానమును తిరిగి రాబట్టి ఇతనిని పట్టాభిషిక్తుని గావించాడు. ఈ గజపతిరాజే చెందుర్తి యుద్ధంలొ విజయనగర మహారాజు ఆనందరాజు నెదురించి పోరాడి పరాజితులై పలాయనం గావించాడు తదుపరి ఆనందగజపతి సామర్లకోటలోనున్న ఫ్రెంచివారిని గొట్టుటకై వెళ్తూండగా జగపతిరాజు పిఠాపురాధీశుడైన రావు నీలాద్రిరాయని కాకర్లపూడి వారితో కలసి కొన్నివేల సైన్యంతో ఆనందగజపతిని సామర్లకోట సమీపాననున్న ఉండూరు వద్ద 1759 డిసెంబరులో నెదుర్కొన్నారు.
గజపతి ధాటికి నిలువలేక జగపతిరాజు మరణించాడు. వత్సవాయి నాల్గవ తిమ్మజగపతిరాజుకు (1760-1797) అప్పుడు ఏడేడ్ల వయస్సు. ఇతను పూసపాటి ఆనందగజపతి భార్య చంద్రయ్యమ్మ సంరక్షణలో పెరిగాడు. ఆనంద గజపతి హైదరాబాద్ ముట్టడి సందర్భంలో దారిలో కాలధర్మంనొందాడు. (1760). చంద్రయమ్మ తమ దత్తుడగు చిన విజయరామగజపతిని, నాల్గవ తిమ్మజగపతిని తోడ్కొని నవాబుతో రాజీపడి విజయనగర రాజ్యము విజయరామ గజపతికిని, పెద్దాపుర రాజ్యము 4వ తిమ్మజగపతికిని స్థిరపరచెను. వీరివురును ప్రియమిత్రులు.
వత్సవాయ నాల్గవ రాయజగపతి (1797-1804) 22 సం.ల ప్రాయమున తండ్రిగారి యనంతరమున 1797లో రాజ్యమునకు వచ్చాడు. ఇతని కాలముననే సంస్థానంన శాశ్వత కర నిర్ణయం (Permanent Settlement) చేయబడి సంస్థానం విస్తరింపబడినది. ఇతని కుమారుడు బుచ్చితిమ్మరాజు (తిమ్మ జగపతిరాజు) 1807లో స్వర్గస్తులైనాడు. జ్ఞాతులగు భీమవరపు కోట శాఖకు చెందిన వత్సవాయ జగన్నాథరాజు 1808 జూలై 29 న సంస్థానంను వశపరచుకొన్నాడు. రాణీగారు దావాలో తామున్నంత కాలం సంస్థానం పాలించుటకును, ఆమె యనంతరం జమీందారీ జగన్నాధరాజు చెందుటకును, జమీందారీలోని కొఠాం ఎస్టేట్ జగన్నాధరాజుకి జీవనాధారంగా నిచ్చుటకు తీర్పు ఇవ్వబడింది. రాణి లక్ష్మీనరసయమ్మ గతించిన వెంటనే రాణి బుచ్చిసీతయ్యమ్మ (1828-1833) 1828 మార్చి 13 న సంస్థానం స్వాధీనపరచుకుంది. ఈమె తర్వాత రాణి బుచ్చి బంగారయ్యమ్మ వత్సవాయ నరసరాజుగారి పౌత్రుడగు వెంకటపతిరాజనే బాలుడిని వెంకటజగపతిరాజు అను పేరుతో పెంచింది. 1834, 1835 సం.లలో సంస్థానం మరల బ్రిటీసు పరిపాలనలో నుండెనట. బుచ్చి బంగారయ్యమ్మ రెండేడ్లు పాలించి స్వర్గస్తురాలయ్యంది.
భీమవరపు కోట: వత్సవాయి జగన్నాథరాజు గారి జేష్ఠపుత్రుడు సూర్యనారాయణ జగపతిరాజు 15-09-1838 న కొఠాం ఎస్టేట్‌ను సంపాదించాడు. మార్చి 1839లో పెద్దాపురం సంస్థానం కూడ ఇతని పరమైంది. 1847లో పెద్దాపురం సంస్థానం మరల బ్ర్రిటీసు వారి పాలైంది. అప్పుడు తుని, కొఠాం ఎస్టేట్లు కలిపివేయబడినవి. సూర్యనారాయణ జగపతి బహద్దరు తమ రాజధానిని తునికి మార్చారు.ఇతని యనంతరము జేష్ఠపుత్రుడు వెంకట జోగిజగన్నాధ జగపతిరాజు స్వల్పకాలం తుని ఎస్టేట్ ను పాలించి స్వర్గస్తులయ్యాడు. 1853లో జన్మించిన ఇతని సోదరుడు వెంకట సింహాద్రిరాజుగారు రాజ్యపాలన చేసారు. ఇతను 11-12-1903న వ్రాసిన వీలునామా ప్రకారం ఇతని భార్య వెంకట సుభద్రయ్య కొఠాం ఎస్టేట్, చర స్థిరాస్తులు యవత్తూ దఖలు పడుటయే గాక తమ యిష్టం వచ్చిన పిల్లవానిని దత్తత చేసుకొనుటకు అధికారం లభించింది. ఆమె వేదపాఠశాలను స్థాపించింది. వందలకొలది క్షత్రియ వివాహాలు జరిపించింది. భీమవరపుకొట వాస్తవ్యులు వత్సవాయ వరాహ నృసింహరాజు గారి జేష్ఠ పుత్రుడగు సత్యనారాయణని దత్తత చేసుకొని వారికి "వెంకట సూర్యనారాయణ జగపతి బహద్దర్" అని పునర్నామకరణము చేసింది. ఇతనికి పుత్రసంతానము కలుగలేదు. ఇతను 1978లో కాలధర్మంనొందాడు. ఇతని పరిపాలన కాలంలో తుని ఎస్టేట్ ఆంధ్రరాష్టంలో విలీనమైంది.ఇతని మరణంతో తుని ప్రభువుల వంశమంతరించింది.
Facts Flags Lists